రైళ్లలో ప్రయాణికులకు రైల్ రెస్ట్రో సేవలు పునర్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-02-01T10:21:46+05:30 IST
కరోనా మహమ్మారితో ఇన్నాళ్లు రైళ్లలో నిలిచిపోయిన ఫుడ్ సప్లయి ఆదివారం నుంచి పునర్ ప్రారంభించారు.....

కోల్‌కతా: కరోనా మహమ్మారితో ఇన్నాళ్లు రైళ్లలో నిలిచిపోయిన ఫుడ్ సప్లయి ఆదివారం నుంచి పునర్ ప్రారంభించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) యొక్క అధీకృత క్యాటరింగ్ భాగస్వామి, ఫుడ్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫాం అయిన రైల్ రెస్ట్రో ఆదివారం నుంచి రైళ్లలో రెస్టారెంట్ ఫుడ్ డెలివరీ సేవలను తిరిగి ప్రారంభించినట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. కరోనా వల్ల దేశంలోని రైళ్లలో ఆహార పంపిణీ సేవలను నిలిపివేశారు. దేశంలోని వడోదర, విజయవాడ, కాన్పూర్ సెంట్రల్, అలహాబాద్, ఇటార్సీ, న్యూఢిల్లీ, అసన్ సోల్, పూణే రైల్వే స్టేషన్ల నుంచి రైల్ రెస్ట్రో ప్రయాణికులకు ఆహారం అందిస్తున్నాయి. దేశంలోని 7వేల రైళ్లలో 450కి పైగా స్టేషన్లలో ప్రయాణికులకు ఆహారాన్ని కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ అందిస్తున్నామని రైల్ రెస్ట్రో సీఈవో మనీష్ చంద్ర చెప్పారు.