రాఫెల్‌ డీల్‌లో అక్రమాలు!

ABN , First Publish Date - 2021-11-09T07:24:27+05:30 IST

రాఫెల్‌ యుద్ధ విమానాల డీల్‌లో మరో అక్రమాన్ని ఫ్రెంచ్‌ పరిశోధన జర్నల్‌ మీడియాపార్ట్‌ వెలుగులోకి తీసుకోచ్చింది. ....

రాఫెల్‌ డీల్‌లో అక్రమాలు!

ఆధారాలున్నా దర్యాప్తునకు సీబీఐ అయిష్టత!

మరిన్ని ఆధారాలు వెల్లడించిన మీడియాపార్ట్‌ తాజా నివేదిక

మధ్యవర్తి సుసేన్‌గుప్తాకు రూ.65 కోట్ల కమీషన్‌

బోగస్‌ ఇన్వాయి్‌సలతో క్లెయిమ్‌ చేసిన దసో!


న్యూఢిల్లీ, నవంబరు 8: రాఫెల్‌ యుద్ధ విమానాల డీల్‌లో మరో అక్రమాన్ని ఫ్రెంచ్‌ పరిశోధన జర్నల్‌ మీడియాపార్ట్‌ వెలుగులోకి తీసుకోచ్చింది. ఫ్రెంచ్‌ కంపెనీ దసో ఏవియేషన్‌ ఓ దళారికి రూ.65 కోట్ల మేర కమీషన్‌ చెల్లించింది. ఆ మొత్తాన్ని ఖర్చులుగా క్లెయిమ్‌ చేసుకోవడానికి బోగస్‌ ఇన్వాయి్‌సలను సృష్టించింది. రూ.59 వేల కోట్ల రాఫెల్‌ డీల్‌ కోసం ఈ మొత్తాన్ని మధ్యవర్తికి అందజేసిందని మీడియాపార్ట్‌ వెల్లడించింది. సుసేన్‌ గుప్తాకు చెందిన మారిషస్‌ షెల్‌ కంపెనీకి ఆ డబ్బును బదలాయించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ పరిశోధనాత్మక కథనాన్ని తన పోర్టల్‌లో ప్రచురించింది. విడతల వారీగా సుసేన్‌కు అందిన రూ. 65 కోట్లలో ఎక్కువ భాగం 2013కు ముందు జరిగిన లావాదేవీలు ఉన్నాయని మీడియాపార్ట్‌ తెలిపింది.  2007-12 మధ్యకాలంలో దసో ఏవియేషన్‌ యుద్ధవిమానాల సరఫరా బిడ్‌ను దక్కించుకోగా..



నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఒప్పందం ఖరారైనట్లు మీడియాపార్ట్‌ స్పష్టం చేసింది. అంతేకాదు.. దసో ఏవియేషన్‌ ఈ మొత్తాన్ని డీల్‌ను చేజిక్కించుకునేందుకు సుసేన్‌కు కిక్‌బ్యాక్‌గా రూ.65 కోట్లు చెల్లించిందనే ఆధారాలు భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి 2018 అక్టోబరు 11న అందాయని వెల్లడించింది. 2015 తర్వాత రాఫెల్‌ డీల్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాంటూ సీబీఐకి 2018 అక్టోబరు 4న ఫిర్యాదు అంద గా.. ఆ తర్వాత వారానికే ఆధారాలు దొరికినా.. చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. ఈ రెండు ఏజెన్సీలు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ వీవీఐపీ చాపర్‌ డీల్‌ స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న సందర్భంలోనూ దసో ఏవియేషన్‌ వ్యవహారాన్ని గుర్తించాయని వివరించింది. దర్యాప్తునకు సీబీఐ అయిష్టతను వ్యక్తం చేసిందంటూ మీడియాపార్ట్‌  కథనం ఇప్పుడు దుమారం రేపుతోంది. గతంలోనూ  ఈ డీల్‌లో అవినీతిపై ప్రచురించిన పరిశోధనాత్మక కథనాలపై గత జూలైలో న్యాయ విచారణకు ఫ్రాన్స్‌ ప్రభు త్వం ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా.. 2014 నాటి వీవీఐపీ చాపర్ల కుంభకోణంలో మోదీ సర్కారు కు.. అగస్టా/ఫిన్మెకానికా సంస్థకు మధ్య కుదిరిన రహ స్య ఒప్పందాలను బహిర్గతం చేయాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-11-09T07:24:27+05:30 IST