వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తైన గ్రామాలకు పంజాబ్ సీఎం బంపర్ ఆఫర్!

ABN , First Publish Date - 2021-05-19T03:39:25+05:30 IST

పంజాబ్‌లో నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న గ్రామాలకు రూ.10 లక్షల మేర ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇస్తామని ..

వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తైన  గ్రామాలకు పంజాబ్ సీఎం బంపర్ ఆఫర్!

చండీగఢ్: పంజాబ్‌లో నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న గ్రామాలకు రూ.10 లక్షల మేర ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. కొవిడ్ వ్యాక్సీన్‌పై గ్రామీణ ప్రజలు తమ సందేహాలను విడిచిపెట్టేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఆయన ఆన్‌లైన్ ద్వారా గ్రామ పంచాయితీలతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘‘కరోనా ముక్త్ పిండ్ అభియాన్‌‌’’ కార్యక్రమంలో భాగంగా కరోనా మహమ్మారిపై పోరాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సర్పంచ్‌లు, మెంబర్లు తమ గ్రామాలను ముందుండి నడిపించాలని సీఎం అమరీందర్ విజ్ఞప్తి చేశారు. కొద్దిపాటి లక్షణాలు ఉన్న వారు కూడా పరీక్షలు చేయించుకునే విధంగా గ్రామస్తులను ప్రోత్సహించాలనీ.. స్వచ్ఛందంగా వ్యాక్సీన్ వేయించుకునేలా అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

Updated Date - 2021-05-19T03:39:25+05:30 IST