పునీత్‌ మృతిపట్ల పలువురు ప్రముఖుల సంతాపం

ABN , First Publish Date - 2021-10-30T16:56:51+05:30 IST

శాండల్‌వుడ్‌ యువరత్న పునీత్‌రాజ్‌కుమార్‌ మృతి పట్ల కర్ణాటక రాజకీయ నేతలు, ప్రముఖులే కాకుండా దేశంలోని అగ్రగణ్యులు సంతాపం తెలిపారు. మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్వీట్‌ ద్వారా సంతాపం తెలిపారు. హర్భజన్‌సింగ్‌ విచారం వ్యక్తం

పునీత్‌ మృతిపట్ల పలువురు ప్రముఖుల సంతాపం

బెంగళూరు: శాండల్‌వుడ్‌ యువరత్న పునీత్‌రాజ్‌కుమార్‌ మృతి పట్ల కర్ణాటక రాజకీయ నేతలు, ప్రముఖులే కాకుండా దేశంలోని అగ్రగణ్యులు సంతాపం తెలిపారు. మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్వీట్‌ ద్వారా సంతాపం తెలిపారు. హర్భజన్‌సింగ్‌ విచారం వ్యక్తం చేశారు. ఆర్‌సీబీ జట్టు తీవ్ర సంతాపం తెలిపింది. మాజీ ప్రధాని దేవేగౌడ, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే సదాశివనగర్‌లోని నివాసానికి వెళ్లి పునీత్‌ పార్థివదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మెగాస్టార్‌ చిరంజీవి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జునతోపాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ ఇదో మాట్లాడలేని బాధాకరమన్నారు. మాజీ సీఎంలు సిద్దరామయ్య ట్వీట్‌ ద్వారా తన సంతాప సందేశాన్ని పంపగా యడియూరప్ప విక్రమ్‌ ఆసుపత్రికి వెళ్లి నివాళులర్పించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సదాశివనగర్‌ నివాసానికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. మంత్రులు అశోక్‌, సోమణ్ణ, గోవింద కారజోళ, ఈశ్వరప్ప సంతాపం తెలిపారు. విషయం తెలియగానే సినీనటులు సదాశివనగర్‌కు చేరుకున్నారు. నటుడు యశ్‌ సదాశివనగర్‌కు వెళ్లి పార్థివదేహాన్ని ఇంట్లోకి స్వయంగా తీసుకెళ్లారు. దర్శన్‌ కూడా పార్థివదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నటి రమ్య ట్వీట్‌ ద్వారా సంతాపం తెలపగా అనుప్రభాకర్‌తోపాటు పలువురు నివాసానికి వచ్చారు. ఒరిస్సా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి భువనేశ్వర్‌ నుంచి హుటాహుటిన బెంగళూరుకు బయల్దేరారు. ఎంపీలు పీసీ మోహన్‌, తేజస్వి సూర్య, ప్రతా్‌పసింహతోపాటు పలువురు సంతాపం తెలిపారు. 

Updated Date - 2021-10-30T16:56:51+05:30 IST