Puneeth Death: బెంగళూరులో మద్యం అమ్మకాలకు సడన్ బ్రేక్
ABN , First Publish Date - 2021-10-29T23:45:29+05:30 IST
ప్రముఖ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం

బెంగళూరు : ప్రముఖ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం నగరంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. మద్యం అమ్మకాలను తక్షణమే నిలిపేసినట్లు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ ప్రకటించారు. ఈ నిషేధం బెంగళూరు నగర కమిషనరేట్ పరిధిలో అమలవుతుందన్నారు. ఈ నిషేధం అక్టోబరు 31 అర్ధరాత్రి వరకు అమలవుతుందన్నారు. అన్ని రెస్టారెంట్లు, బార్లు, వైన్ షాపులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు.