కొవిడ్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్..సెక్స్ వర్కర్లకు టీకాలు
ABN , First Publish Date - 2021-07-09T14:57:24+05:30 IST
పూణే నగరంలోని 5వేల మంది సెక్స్ వర్కర్ల కోసం పూణే మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తోంది....
పూణే (మహారాష్ట్ర): పూణే నగరంలోని 5వేల మంది సెక్స్ వర్కర్ల కోసం పూణే మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఓ స్వచ్ఛంద సంస్థ కోరడంతో పూణే మున్సిపల్ అధికారులు సెక్స్ వర్కర్ల కోసం ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది.కొవిడ్ టీకాలు వేయించుకునేందుకు సెక్స్ వర్కర్లు పడుతున్న ఇబ్బందులను చూసి ఓ స్వచ్ఛంద సంస్థ మున్సిపల్ అధికారులకు చెప్పారు. కరోనా వైరస్ థర్డ్ వేవ్ వస్తుందనే భయం నేపథ్యంలో పూణే మున్సిపల్ అధికారులు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. మహారాష్ట్రలో కరోనా నివారణకు ముందు జాగ్రత్తగా 20 వేలమంది యువతకు ఆరోగ్య, నర్సింగ్, పారామెడికల్ రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు.ముఖ్యమంత్రి మహా ఆరోగ్య పథకం కింద కరోనా మహమ్మారి నివారణకు మానవ వనరులను పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టారు.