మతవిద్వేష ప్రసంగాలు... పుణెలో ఆరుగురిపై కేసు

ABN , First Publish Date - 2021-12-30T07:38:30+05:30 IST

మత విద్వేషాలను రెచ్చగొట్టడంతో పాటు కొందరి మనోభావాలు దెబ్బతినేలా ప్రసంగించారన్న ఆరోపణలపై హిందూ సన్యాసి కాళీచరణ్‌ మహరాజ్‌, ..

మతవిద్వేష ప్రసంగాలు... పుణెలో ఆరుగురిపై కేసు

పుణె, డిసెంబరు 29: మత విద్వేషాలను రెచ్చగొట్టడంతో పాటు కొందరి మనోభావాలు దెబ్బతినేలా ప్రసంగించారన్న ఆరోపణలపై హిందూ సన్యాసి కాళీచరణ్‌ మహరాజ్‌, మితవాద నాయకుడు మిలింద్‌ ఎక్‌బోటే సహా మరో నలుగురిపై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. మొఘలుల సేనాని అఫ్జల్‌ ఖాన్‌ను ఛత్రపతి శివాజీ హతమార్చిన సందర్భాన్ని పురస్కరించుకొని మహారాష్ట్రలో ఎక్‌బోటేకు చెందిన సమస్త్‌ హిందూ అఘాడీ సంస్థ 19న ‘శివ్‌ ప్రతాప్‌ దిన్‌’ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో కాళీచరణ్‌ మహరాజ్‌, ఎక్‌బోటే, కెప్టెన్‌ దిజేంద్ర కుమార్‌(రిటైర్డ్‌), కార్గిల్‌ యుద్ధవీరుడు, ‘మహావీర్‌ చక్ర’ పురస్కార గ్రహీత కెప్టెన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ముస్లింలు, క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా నిందితులు వ్యాఖ్యలు చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమ వీడియో ఫుటేజీ చూసి సుమోటోగా కేసు నమోదు చేశామన్నారు.

Updated Date - 2021-12-30T07:38:30+05:30 IST