కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2021-05-18T17:43:45+05:30 IST

ముఖ్యమంత్రి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ముఖ్యమంత్రి

చెన్నై/అడయార్‌ : ఇటీవల కరోనా వైరస్‌ బారినపడిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో పుదుచ్చేరి చేరుకున్నారు. ఈనెల 2వ తేదీన వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో ఆయన సారథ్యంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో 7వ తేదీన  ముఖ్యమంత్రిగా ఆయన ప్రయాణస్వీకారం చేశారు. ఈ  కార్యక్రమం తర్వాత రంగస్వామి అస్వస్థతకు లోనైన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు కొవిడ్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనను హుటాహుటిన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన... పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఆయన సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత నేరుగా ఆయన కారులోనే పుదుచ్చేరి బయలుదేరి వెళ్ళారు.

Updated Date - 2021-05-18T17:43:45+05:30 IST