దొడ్డి దోవన పబ్‌జీ.. నిషేధించండి: కెయిట్‌

ABN , First Publish Date - 2021-06-22T06:55:13+05:30 IST

నిషేధిత పబ్‌జీ గేమ్‌లోని చాలా ఫీచర్లు కలిగి ఉన్న ‘బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా’ యాప్‌ను

దొడ్డి దోవన పబ్‌జీ.. నిషేధించండి: కెయిట్‌

న్యూఢిల్లీ, జూన్‌ 21: నిషేధిత పబ్‌జీ గేమ్‌లోని చాలా ఫీచర్లు కలిగి ఉన్న ‘బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా’ యాప్‌ను నిషేధించాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (కెయిట్‌) కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు విజ్ఞప్తి చేసింది. త్వరలో బారత్‌లో లాంచ్‌ కానున్న బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా గేమ్‌.. పబ్‌జీకి దాదాపు రీప్యాకేజ్‌డ్‌ వెర్షన్‌ అని ఆరోపించింది. ఈ గేమ్‌ భారత జాతీయ భద్రతకు, కోట్లాదిమంది భారతీయుల సమాచారానికి, వ్యక్తిగత గోప్యతకు, యువతరానికి ముప్పు అని ఆందోళన వ్యక్తం చేసింది. 

Updated Date - 2021-06-22T06:55:13+05:30 IST