యూపీ ఎన్నికల్లో 40 టికెట్లు మహిళలకే

ABN , First Publish Date - 2021-10-20T07:58:53+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 40 శాతం టికెట్లను మహిళలకే ఇస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రకటించారు.

యూపీ ఎన్నికల్లో 40 టికెట్లు మహిళలకే

ప్రియాంకా గాంధీ ప్రకటన

న్యూఢిల్లీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 40 శాతం టికెట్లను మహిళలకే ఇస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రకటించారు. మంగళవారం లఖ్‌నవూలో విలేకరుల సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. మహిళా రాజకీయ నాయకులే యూపీలో విద్వేష రాజకీయాలను అంతం చేయగలరని అన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రకటనను బీఎస్పీ అధినేత్రి ఎన్నికల నాటకంగా అభివర్ణించారు.

Updated Date - 2021-10-20T07:58:53+05:30 IST