14న చెన్నై నగరానికి మోదీ

ABN , First Publish Date - 2021-02-01T14:23:23+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 14వ తేదీ చెన్నై రానున్నారు. చెన్నై నగరంలో మెట్రోరైలు రెండోదశ విస్తరణ పనులకు, కావేరి-గుండారు అనుసంధాన పథకానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు..

14న చెన్నై నగరానికి మోదీ

చెన్నై(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 14వ తేదీ చెన్నై రానున్నారు. చెన్నై నగరంలో మెట్రోరైలు రెండోదశ విస్తరణ పనులకు, కావేరి-గుండారు అనుసంధాన పథకానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి పళనిస్వామి ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని మెరీనాబీచ్‌లో నిర్మించిన జయలలిత స్మారక మందిరం ప్రారంభో త్సవానికి, మెట్రోరైలు రెండో దశ విస్తరణ పనులు, కావేరి - గుండారు అనుసంధాన పథకానికి శంకుస్థాపనకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే స్మారక మందిరం ప్రారంభోత్సవానికి రాలేనని, మెట్రోరైలు రెండో దశ విస్తరణ పనులు, కావేరి - గుండారు అనుసంధాన పథకం శంకుస్థాపనకు వస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ రెండు పథకాల శంకుస్థాపన కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేపడుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధాని మోదీ చెన్నై నగరంలో ఆ రెండు పథకాలకు శంకుస్థాపన చేసి ఆ సందర్భంగా ఏర్పాటయ్యే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

Updated Date - 2021-02-01T14:23:23+05:30 IST