గత ప్రభుత్వాలను ప్రజలు ఏమాత్రం విశ్వసించలేదు : మోదీ

ABN , First Publish Date - 2021-01-20T19:35:17+05:30 IST

ప్రధానమంత్రి అవాస్ యోజన కింద లబ్ధి పొందుతున్న వారికి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నిధులు విడుదల చేశారు. దాదాపు 6.1

గత ప్రభుత్వాలను ప్రజలు ఏమాత్రం విశ్వసించలేదు : మోదీ

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి అవాస్ యోజన కింద లబ్ధి పొందుతున్న వారికి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నిధులు విడుదల చేశారు. దాదాపు 6.1 లక్ష మంది లబ్ధిదారులకు 2691 కోట్ల రూపాయలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఇళ్ల నిర్మాణ విషయంలో గత ప్రభుత్వాల ధోరణి చూశామని, ముఖ్యంగా యూపీని పాలించిన గత ప్రభుత్వాల ధోరణిని చూశామని, ఆ ప్రభుత్వాలను ప్రజలు ఏమాత్రం విశ్వసించలేదని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణ విషయంలో గత ప్రభుత్వాలు పేదలకు ఏమాత్రం సహాయ సహకారాలను అందించలేదని విమర్శించారు. కొన్నేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లోనే సుమారు రెండు కోట్ల ఇళ్లను నిర్మించామని, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద 1.25 కోట్ల ఇళ్లను ఇప్పటికే ప్రజలకు అందజేశామని ఆయన పేర్కొన్నారు. అందులో 1.50 లక్షల ఇళ్లు కేవలం కేంద్ర ప్రభుత్వమే కట్టిందని మోదీ తెలియజేశారు. కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చి కేంద్రం మంచి పని చేసిందని, ఇప్పుడు పేదల కోసం ఇళ్లను ఇచ్చి మరింత మంచి పని చేసిందని తెలిపారు. పేదలకు పక్కా ఇళ్లు అందివ్వడమే తమ లక్ష్యమని మోదీ ప్రకటించారు. 

Updated Date - 2021-01-20T19:35:17+05:30 IST