అమరజవాన్లకు మోదీ ఘన నివాళి

ABN , First Publish Date - 2021-12-10T02:42:53+05:30 IST

న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ సమీపంలో సైనిక హెలికాఫ్టర్ ప్రమాదంలో అసువులు బాసిన త్రివిధ దళాల సారథి రావత్, ఆయన భార్య సహా 13 మందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు.

అమరజవాన్లకు మోదీ ఘన నివాళి

న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ సమీపంలో సైనిక హెలికాఫ్టర్ ప్రమాదంలో అసువులు బాసిన త్రివిధ దళాల సారథి రావత్, ఆయన భార్య సహా 13 మందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఆయన అమరజవాన్ల భౌతికకాయాల వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడే ఉన్న అమరజవాన్ల కుటుంబసభ్యులను మోదీ పరామర్శించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో పాటు పలువురు మంత్రులు, సైన్యాధికారులు కూడా అమరజవాన్లకు నివాళులర్పించారు.   


రేపు సీడీఎస్ రావత్ అంత్యక్రియలు 

ఉదయం 11 నుంచి 12:30 గంటలకు ప్రజల సందర్శనార్థం రావత్ భౌతికకాయన్ని అందుబాటులో ఉంచుతారు. సాయంత్రం 4 గంటలకు రావత్ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.Updated Date - 2021-12-10T02:42:53+05:30 IST