పప్పుధాన్యాల నిల్వల వివరాలు వెల్లడించాలి

ABN , First Publish Date - 2021-05-18T07:45:28+05:30 IST

పప్పుధాన్యాల నిల్వల వివరాలను మిల్లర్లు, ట్రేడర్లు, దిగుమతిదారులు వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది

పప్పుధాన్యాల నిల్వల వివరాలు వెల్లడించాలి

ధరలను పర్యవేక్షించాలి: కేంద్రం సూచన


న్యూఢిల్లీ, మే 17 (ఆంధ్రజ్యోతి): పప్పుధాన్యాల నిల్వల వివరాలను మిల్లర్లు, ట్రేడర్లు, దిగుమతిదారులు వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రకటించిన వివరాలను ధృవీకరించాలని పేర్కొంది. వారంవారం పప్పుధాన్యాల ధరలను పర్యవేక్షించాలని నిర్దేశించింది.  లాక్‌డౌన్‌ పేరిట కొంత మంది వ్యాపారులు పప్పుధాన్యాలపై కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు కేంద్రం దృష్టికి రావడంతో సోమవారం అన్ని రాష్ట్రాల అధికారులతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి లీనా నందన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. నిత్యావసర సరుకుల చట్టం-1955 ప్రకారం సామాన్య ప్రజల కోసం రేషన్‌ షాపుల్లో సరుకులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పప్పుధాన్యాలతో పాటు నూనెగింజలు, కూరగాయలు, పాలు తదితర 22 సరుకుల ధరలు అసాధారణ రీతిలో పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచన చేసింది. 

Updated Date - 2021-05-18T07:45:28+05:30 IST