వైట్‌హౌస్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయిన ట్రంప్

ABN , First Publish Date - 2021-01-21T00:52:30+05:30 IST

అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ ఖాళీ చేశారు. ఫ్లోరిడాలోని తన ఇంటికి ట్రంప్ దంపతులు బయల్దేరారు. బైడన్ ప్రమాణ స్వీకారానికి ముందే...

వైట్‌హౌస్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయిన ట్రంప్

అమెరికా: డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌ను ఖాళీ చేశారు. ఫ్లోరిడాలోని తన ఇంటికి ట్రంప్ దంపతులు బయల్దేరారు. బైడన్ ప్రమాణ స్వీకారానికి ముందే ట్రంప్ వైట్‌హౌస్ ఖాళీ చేయడం గమనార్హం. రాత్రి 10.30 గంటలకు అమెరికా కొత్త అధ్యక్షుడిగా బైడన్ ప్రమాణం జరగనుంది. బైడన్ ప్రమాణానికి కూడా హాజరుకాకూడదని ట్రంప్ నిర్ణయించుకున్నారు. సంక్షుభిత రాజకీయ పరిణామాల మధ్య అమెరికా 46వ అధ్యక్షుడిగా జోసెఫ్‌ రాబినెట్‌ బైడెన్‌ జూనియర్‌ ఉరఫ్‌ జో బైడెన్‌ (78) బుధవారం నాడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని తుదిదాకా అంగీకరించకుండా, ఆఖరికి దేశ ప్రజాస్వామ్యసౌధంపైనే దాడికి అనుచరులను పురిగొల్పి- రెండుసార్లు అభిశంసనను మూటగట్టుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ స్థానే బైడెన్‌ ఈ బాధ్యతలను స్వీకరిస్తున్నారు.


అదే కేపిటల్‌ హిల్‌ భవన మెట్లపై ఏర్పాటు చేసిన వేదిక నుంచి ఆయన పదవీ ప్రమాణం చేస్తారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ ఆయన కంటే ముందుగానే ప్రమాణం చేస్తారు. భారతీయ మూలాలున్న కమల ఇక మీదట శ్వేతసౌధంలో అత్యంత కీలకపాత్ర పోషించనున్నారు. ఓ రకంగా ఆమే అన్ని వ్యవహారాల్లో కేంద్ర బిందువు అవుతారు.

Updated Date - 2021-01-21T00:52:30+05:30 IST