గోమూత్రంతో కరోనా రాదు: ప్రజ్ఞాసింగ్‌

ABN , First Publish Date - 2021-05-18T07:31:55+05:30 IST

కరోనా వైరస్‌, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ నుంచి ఆవు మూత్రం రక్షణనిస్తుందని భోపాల్‌ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ అన్నారు

గోమూత్రంతో కరోనా రాదు: ప్రజ్ఞాసింగ్‌

భోపాల్‌, మే 17: కరోనా వైరస్‌, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ నుంచి ఆవు మూత్రం రక్షణనిస్తుందని భోపాల్‌ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ అన్నారు. భోపాల్‌లోని బైరాగఢ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘దేశీ ఆవు మూత్ర సారం ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా రక్షణనిస్తుంది. నాకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. కానీ ప్రతిరోజూ గోమూత్ర సారం తీసుకుంటున్నాను. గోమూత్రం ప్రాణాలు కాపాడే ఔషధం’ అన్నారు.

Updated Date - 2021-05-18T07:31:55+05:30 IST