పాకిస్థాన్‌లో పెరిగిన పేదరికం...వరల్డ్ బ్యాంకు అంచనా

ABN , First Publish Date - 2021-06-22T12:20:34+05:30 IST

పాకిస్థాన్ దేశంలో పేదల సంఖ్య గతంలో కంటే పెరిగింది....

పాకిస్థాన్‌లో పెరిగిన పేదరికం...వరల్డ్ బ్యాంకు అంచనా

ఇస్లామాబాద్ (పాకిస్థాన్): పాకిస్థాన్ దేశంలో పేదల సంఖ్య గతంలో కంటే పెరిగింది. పాక్ లో పేదరికం శాతం 2019 కంటే 2020లో పెరిగిందని ప్రపంచ బ్యాంకు తన తాజా అంచనా నివేదికలో వెల్లడించింది. 2019లో పాకిస్థాన్ దేశంలో పేదరికం శాతం 4.4 ఉండగా, 2020 నాటికి 5.4శాతానికి పెరిగిందని వరల్డ్ బ్యాంకు నివేదించింది. పాక్ లో 40శాతం మంది కుటుంబాలకు ఆహార భద్రత కొరవడిందని ప్రపంచ బ్యాంకు తేల్చిచెప్పింది. కొవిడ్ వైరస్ ప్రభావం వల్ల దేశంలో పేదరికం శాతం పెరిగిందని వెల్లడించింది. 


కరోనా వైరస్ మహమ్మారి వల్ల పాకిస్థాన్ దేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలిందని, స్థూల జాతీయ ఉత్పత్తి పడిపోయిందని వెల్లడించింది. దేశంలో కార్మికులు ఉపాధి కోల్పోయారని, నిరుద్యోగం పెరిగిందని వరల్డ్ బ్యాంకు తెలిపింది. పాక్ లో వ్యవసాయరంగం క్షీణించి పేదరికం పెరిగిందని, దేశం దీనివల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రపంచ బ్యాంకు తన తాజా నివేదికలో వెల్లడించింది. 

Updated Date - 2021-06-22T12:20:34+05:30 IST