శవాల వల్ల గంగానదిలో కాలుష్యం పెరగలేదు

ABN , First Publish Date - 2021-06-22T07:20:54+05:30 IST

కొవిడ్‌-19తో మరణించినవారి మృతదేహాలు పడవేయడం వల్ల గంగానదిలో కాలుష్యం

శవాల వల్ల గంగానదిలో కాలుష్యం పెరగలేదు

జలశక్తి మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ, జూన్‌ 21: కొవిడ్‌-19తో మరణించినవారి మృతదేహాలు పడవేయడం వల్ల గంగానదిలో కాలుష్యం పెరగలేదని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతదేహాలను నదిలో పారవేయడం వల్ల నీరు కలుషితమయ్యాయాఅనే అంశంపై నివేదిక ఇవ్వమని స్వచ్ఛగంగ జాతీయమిషన్‌(ఎన్‌ఎంసీజీ) మే నెలలో కేంద్రం, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ కాలుష్య నియంత్రణ మండళ్లను,  కేంద్ర జల కమిషన్‌ను కోరింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు డేటాను పరిశీలిస్తే కొన్ని ప్రాంతాలు మినహా  నదిలో నీరు స్నానం చేసే ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నట్లు ఎన్‌ఎంసీజీ పేర్కొంది. గత ఏడాదితో పోల్చినా నీటి నాణ్యతలో మార్పులేదని తెలిపింది. 


Updated Date - 2021-06-22T07:20:54+05:30 IST