కేరళలో ఏప్రిల్‌ 6న పోలింగ్‌

ABN , First Publish Date - 2021-02-26T23:02:42+05:30 IST

కేరళలో ఒకే దశలో పోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేరళలో ఏప్రిల్‌ 6న పోలింగ్‌ నిర్వహిస్తారు.

కేరళలో ఏప్రిల్‌ 6న పోలింగ్‌

ఢిల్లీ: కేరళలో ఒకే దశలో పోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేరళలో ఏప్రిల్‌ 6న పోలింగ్‌.. మే 2న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. అదేవిధంగా ఏప్రిల్‌ 6న రాష్ట్రంలోని మల్లాపురం లోక్‌సభ ఉప ఎన్నిక నిర్వహిస్తారు. కేరళతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించింది. మొత్తంగా త్వరలో జరగబోయే ఐదు అసెంబ్లీల్లో 824 స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జరగనున్న పరిధిలో 18.68 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు 2.7 లక్షల సిబ్బందిని వినియోగించనున్నట్లు ఈసీ ప్రకటించింది.

Updated Date - 2021-02-26T23:02:42+05:30 IST