పంజాబ్‌లో 22 రైతు సంఘాల ఫ్రంట్‌

ABN , First Publish Date - 2021-12-26T06:58:55+05:30 IST

పంజాబ్‌లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన 32 రైతు సంఘాల్లో, 22 సం ఘాలు ఏకమై రాజకీయ ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి...

పంజాబ్‌లో 22 రైతు సంఘాల ఫ్రంట్‌

 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటన

చండీగఢ్‌, డిసెంబరు 25: పంజాబ్‌లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన 32 రైతు సంఘాల్లో, 22 సం ఘాలు ఏకమై రాజకీయ ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. రాష్ట్రంలో త్వ రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్రంట్‌ ద్వారా పోటీ చేస్తామని ఆయా సంఘాల నేతలు తాజాగా ప్రకటించారు. రైతు చట్టాలపై పోరాటం అనంతరం పంజాబ్‌లో తమపై అంచనాలు పెరిగాయని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ కడియన్‌) నేత హర్మీత్‌ సింగ్‌ కడియన్‌ విలేకరులకు తెలిపారు. సంయుక్త సమాజ్‌ మోర్చా పేరిట ప్రజల ముందుకు రానున్నట్లు పేర్కొన్నారు. బీకేయూ(దకౌండా), బీకేయూ(లఖోవాల్‌) సంఘాలు తమ నిర్ణయానికి మద్దతు తెలిపాయని చెప్పారు. ‘‘వచ్చే ఏడాది రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పోటీ చే స్తాం. ఇతర సంఘాలు కూడా మాతో కలవాలని ఆహ్వానిస్తు న్నాం’’ అన్నారు. బీకేయూ(రాజేవాల్‌)కు చెందిన బల్‌బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ ఈ మోర్చాకు నేతృత్వం వహిస్తారన్నారు. 

Updated Date - 2021-12-26T06:58:55+05:30 IST