శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-02-08T12:02:45+05:30 IST

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినచర్యలు చేపడతామని రాష్ట్ర పోలీసు శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పోలీసు శాఖ విడుదల చేసిన ప్రకటనలో, కొన్ని సంఘాలకు ...

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

పోలీసు శాఖ హెచ్చరిక

చెన్నై/ఐసిఎఫ్‌(ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినచర్యలు చేపడతామని రాష్ట్ర పోలీసు శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పోలీసు శాఖ విడుదల చేసిన ప్రకటనలో, కొన్ని సంఘాలకు చెందిన వారు రాజకీయ లబ్ది కోసం ఇతర సంఘాలకు చెందిన వారిని కించపరుస్తున్నారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని, రాకపోక లకు అంతరాయం కలిగించేలా ఆందోళన చేపడుతున్నారని పేర్కొంది. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారి విషయమై సమీపంలోని పోలీస్‌ స్టేషన్లకు ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.

Updated Date - 2021-02-08T12:02:45+05:30 IST