మోదీ సినిమాల్లో నటిస్తే బాగుంటుంది : కాంగ్రెస్ ఎద్దేవా

ABN , First Publish Date - 2021-05-22T01:26:14+05:30 IST

కరోనా మృతులను తలుచుకుంటూ ప్రధాని మోదీ భావోద్వేగం కావడంపై కాంగ్రెస్ స్పందించింది. ప్రధాని మోదీ

మోదీ సినిమాల్లో నటిస్తే బాగుంటుంది : కాంగ్రెస్ ఎద్దేవా

న్యూఢిల్లీ : కరోనా మృతులను తలుచుకుంటూ ప్రధాని మోదీ భావోద్వేగం కావడంపై కాంగ్రెస్ స్పందించింది. ప్రధాని మోదీ సినిమాలో నటిస్తే బాగుంటుందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చురకలంటించారు. గుజరాత్‌ సీఎంగా మోదీ ఉన్నప్పటి నుంచీ ఆయనను తెలిసిన వారందరూ మోదీ రాజకీయంలో లేకుంటే సినిమాల్లో ఉండేవారని అంటుంటారని ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. ఆయన సినిమా రంగంలో ఉంటే వారికి ఎంతో లాభం ఉండేదని, రాజకీయాల్లో ఉండటంతో దేశానికి నష్టం వాటిల్లిందని పవన్ ఖేరా ట్వీట్ చేశారు. 


Updated Date - 2021-05-22T01:26:14+05:30 IST