కేదార్‌నాథ్‌లో శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ
ABN , First Publish Date - 2021-10-29T00:51:29+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబరు 5న ఉత్తరాఖండ్

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబరు 5న ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో పర్యటిస్తారు. కేదార్నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం శ్రీ ఆది
శంకరాచార్య సమాధిని ప్రారంభి, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 2013నాటి వరదల్లో దెబ్బతిన్న ఈ సమాధిని మోదీ పర్యవేక్షణలో పునర్నిర్మించారు.
కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, మోదీ వచ్చే నెల 5న కేదార్‌నాథ్‌లో పర్యటిస్తారు. కేదార్నాథ్ దేవాలయంలో పూజలు
చేసిన తర్వాత శ్రీ ఆది శంకరాచార్య సమాధిని ప్రారంభించి, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 2013నాటి వరదల్లో దెబ్బతిన్న ఈ సమాధిని మోదీ పర్యవేక్షణలో
పునర్నిర్మించారు. సరస్వతి ఆస్థా పథ్ (విశ్వాస మార్గం) వెంబడి జరిగిన, జరుగుతున్న పనులను సమీక్షిస్తారు.
సరస్వతి రిటెయినింగ్ వాల్ ఆస్థా పథ్, స్నాన ఘట్టాలు, మందాకిని రిటెయినింగ్ వాల్ ఆస్థా పథ్, తీర్థ పురోహితుల ఇళ్ళు, మందాకిని నదిపై గరుడ్ ఛట్టి వంతెన సహా
ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. రూ.130 కోట్లతో ఈ ప్రాజెక్టులను పూర్తి చేశారు.
సంగం ఘాట్ అభివృద్ధి, ప్రాథమిక చికిత్స, పర్యాటకుల సదుపాయాల కేంద్రం, పరిపాలనా కార్యాలయ భవనం, ఆసుపత్రి సహా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. వీటి
కోసం రూ.180 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అనంతరం మోదీ ఓ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.