ఈ నెల 30 న ప్రధాని మోదీ అధ్యక్షత అఖిలపక్ష సమావేశం

ABN , First Publish Date - 2021-01-20T17:59:59+05:30 IST

ఈ నెల 30 న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి

ఈ నెల 30 న ప్రధాని మోదీ అధ్యక్షత అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ : ఈ నెల 30 న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం వెల్లడించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎత్తు పల్లాలను చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు పార్లమెంట్ సమావేశాల అజెండాను కూడా రాజకీయ పక్షాల ముందుంచనున్నట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ఆర్థిక నిపుణులు, వ్యాపారవేత్తలు ఓ దఫా సమావేశం నిర్వహించారు. వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ నెల 30 న ప్రధాని మోదీ అన్ని రాజకీయ పక్షాల సలహాలను స్వీకరించనున్నారు. మరోవైపు ఎన్డీయే భాగస్వామ్య పక్ష సమావేశం కూడా ఈ నెల 30 నే జరగనుంది. బీజేపీ, అన్నాడీఎంకే, జేడీయూతో పాటు మరికొన్ని రాజకీయ పక్షాలు ఈ భేటీకి హాజరుకానున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల దృష్ట్యా అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరపనున్నారు.

Updated Date - 2021-01-20T17:59:59+05:30 IST