ఇండియన్ ఆర్థోడాక్స్ చర్చి సుప్రీం హెడ్ మృతి పట్ల మోదీ సంతాపం

ABN , First Publish Date - 2021-07-12T22:02:05+05:30 IST

ఇండియన్ ఆర్థోడాక్స్ చర్చి సుప్రీం హెడ్ మోరన్ మార్ బసెలియోస్ మార్తోమా పాలోస్ II మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం...

ఇండియన్ ఆర్థోడాక్స్ చర్చి సుప్రీం హెడ్ మృతి పట్ల మోదీ సంతాపం

న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్థోడాక్స్ చర్చి సుప్రీం హెడ్ మోరన్ మార్ బసెలియోస్ మార్తోమా పాలోస్ II మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ఆర్థోడాక్స్ చర్చి సుప్రీం హెడ్, పరమ పూజనీయ మోరన్ మార్ బసెలియోస్ మార్తోమా పాలోస్ II మృతి అత్యంత విషాదకరం. సేవ, కరుణల గొప్ప వారసత్వాన్ని ఆయన వదిలివెళ్లారు. ఈ విపత్కర సమయంలో ఆర్థోడాక్స్ చర్చి సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా కేరళలోని పరుమళ గ్రామంలోని సెయింట్ జార్జ్ మిషన్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న మార్తోమా పాలోస్ II ఇవాళ తెల్లవారుజామున 2.35కి తుదిశ్వాస విడిచారు.


ఆదివారం ఉదయం నుంచే ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించినట్టు ఆస్పత్రి మెడికల్ బులిటిన్‌ పేర్కొంది. ‘‘కృత్రిమ శ్వాస ద్వారా అధికమొత్తంలో ఆక్సిజన్ సపోర్టు ఇచ్చినప్పటికీ... ఆయన రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు నియంత్రణలోకి రాలేదు...’’ అని ఆస్పత్రి పేర్కొంది. 2019 డిసెంబర్ నుంచి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్న మార్తోమా పాలోస్ II, సెయింట్ జార్జ్ మిషన్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన కొవిడ్-19 బారిన పడి కోలుకున్నారనీ.. కరోనా అనంతర సమస్యల కారణంగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆస్పత్రి పేర్కొంది. 



Updated Date - 2021-07-12T22:02:05+05:30 IST