4న పినాకిని ఎక్స్‌ప్రెస్‌ గూడూరు వరకే...

ABN , First Publish Date - 2021-12-31T16:33:20+05:30 IST

జనవరి నెల 4వ తేదీన విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్‌ రావాల్సిన పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ (12711) గూడూరు వరకే ఆగిపోనుంది. తిరిగి అదే రైలు (12712) అదే రోజు సాయంత్రం 4.20 గంటలకు గూడూరు నుంచి విజయవాడ

4న  పినాకిని ఎక్స్‌ప్రెస్‌ గూడూరు వరకే...

చెన్నై: జనవరి నెల 4వ తేదీన విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్‌ రావాల్సిన పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ (12711) గూడూరు వరకే ఆగిపోనుంది. తిరిగి అదే రైలు (12712) అదే రోజు సాయంత్రం 4.20 గంటలకు గూడూరు నుంచి విజయవాడ బయలుదేరనుంది. 

- మదురై - ఎగ్మూర్‌ వైగై సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12636) జనవరి 5, 19 తేదీల్లో విల్లుపురం వరకే వచ్చి ఆగిపోనుంది. 

- ఎగ్మూర్‌ - కారైక్కుడి పల్లవన్‌ ఎక్స్‌ప్రెస్‌ (12605) జనవరి 5, 19 తేదీల్లో విల్లుపురం వరకే వచ్చి ఆగిపోనుంది. ఈ రైలు ఆయా రోజుల్లో సాయంత్రం 6.10 గంటలకు విల్లుపురం నుంచి బయలుదేరనుంది. 

- జనవరి 5, 19 తేదీల్లో బయలుదేరే పుదుచ్చేరి - న్యూ ఢిల్లీ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (22403)ను దారి మళ్లించారు. ఈ రైలు విల్లుపురం - కాట్పాడి - అరక్కోణం - పెరంబూర్‌ - కొరుకుపేట మీదగా వెళ్లనుంది. ఈ రైలు ఎగ్మూరు వెళ్లనందున అదనంగా పెరంబూరులో ఆగుతుందని దక్షిణరైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2021-12-31T16:33:20+05:30 IST