భారత్ నుంచి వైదొలిగిన ఫైజర్

ABN , First Publish Date - 2021-02-05T18:55:41+05:30 IST

అమెరికాలో తయారైన కరోనా టీకా ఫైజర్ భారత్‌ నుంచి వైదొలిగింది.

భారత్ నుంచి వైదొలిగిన ఫైజర్

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో తయారైన కరోనా టీకా ఫైజర్ భారత్‌ నుంచి వైదొలిగింది. అంతేకాదు భారత్‌లో అత్యవసర వినియోగం కోసం దాఖలు చేసిన దరఖాస్తును కూడా వెనక్కి తీసుకుంది. దీంతో ఫైజర్ టీకా భారత్ నుంచి ప్రస్తుతానికి వెనక్కి వెళ్లిపోయినట్లైంది. భారత డ్రగ్ రెగ్యులేటరీతో బుధవారం సమావేశం తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫైజర్ పేర్కొంది. ఫైజర్ టీకాకు పనితీరుకు సంబంధించి భారత్‌లో మళ్లీ ట్రయల్స్ నిర్వహించాలని, అలాగే దానిని భారత ప్రజలు ఎలా తీసుకుంటున్నారో తెలుసుకోవాలని భారత రెగ్యులేటరీ కోరింది. దీంతో ఫైజర్ తమ దరఖాస్తును వెనక్కి తీసేసుకుంది. అయితే త్వరలో మిగతా వివరాలను కూడా సేకరించి మళ్లీ దరఖాస్తు చేస్తామని ఫైజర్ యాజమాన్యం తెలిపింది.

Updated Date - 2021-02-05T18:55:41+05:30 IST