పిల్లలకు ఫైజర్‌ ఓకే.. ఈయూ అనుమతి

ABN , First Publish Date - 2021-05-30T09:44:49+05:30 IST

పిల్లలకు టీకా విషయంలో కీలక ముందడుగు పడింది. 12-15 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు ఫైజర్‌/బయో ఎన్‌టెక్‌

పిల్లలకు ఫైజర్‌ ఓకే.. ఈయూ అనుమతి

12-15 ఏళ్ల వారికీ ఫైజర్‌ టీకా

ఈయూ అనుమతి.. జూన్‌లో వ్యాక్సినేషన్‌ ప్రారంభం: జర్మనీ

టీకాపై నిర్ణయం తల్లిదండ్రులదే.. ఈయూ ఆరోగ్య కమిషనర్‌

ముక్కులో స్ర్పే.. 99 శాతం వైరస్‌ హతం!

మా స్ర్పే కొవిడ్‌పై బాగా పనిచేస్తోంది: శానోటైజ్‌ 

డీఎన్‌ఏ వ్యాక్సిన్‌తో దీర్ఘకాలిక రక్షణ: తైవాన్‌ శాస్త్రవేత్తలు


ద హేగ్‌, మే 29: పిల్లలకు టీకా విషయంలో కీలక ముందడుగు పడింది. 12-15 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు ఫైజర్‌/బయో ఎన్‌టెక్‌ టీకాకు ఆమోదం లభించింది. 12-15 ఏళ్ల వారిపై ఫైజర్‌ టీకా సమర్థంగా పనిచేసిందని, దుష్ప్రభావాలేవీ పెద్దగా వెలుగుచూడలేదని ఈయూ ఔషధ సంస్థ (ఈఎంఏ) వెల్లడించింది. అమెరికాకు చెందిన ఫైజర్‌, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ సంస్థ సంయుక్తంగా రూపొందించిన కొవిడ్‌ టీకాను ఇప్పటి వరకు ఐరోపాలో 16 ఏళ్లకు పైబడిన వారికే వేస్తున్నారు.  

Updated Date - 2021-05-30T09:44:49+05:30 IST