ఫైజర్ టీకా 94% సమర్థవంతం
ABN , First Publish Date - 2021-02-26T09:33:35+05:30 IST
కరోనాకు ఫైజర్ సంస్థ రూపొందించిన టీకా 94 శాతం సమర్థవంతమని తేలింది. ఈ టీకా రెండు డోసులు తీసుకున్నవారు..

జెరూసలెం, ఫిబ్రవరి 25: కరోనాకు ఫైజర్ సంస్థ రూపొందించిన టీకా 94 శాతం సమర్థవంతమని తేలింది. ఈ టీకా రెండు డోసులు తీసుకున్నవారు.. అసలు టీకా తీసుకోనివారి కంటే కరోనా బారినపడే అవకాశం 92 శాతం తక్కువని స్పష్టమైంది. ఒక డోసు తీసుకున్నవారిలో రెండు, మూడు వారాలతర్వాత వైరస్ తీవ్ర ముప్పు 62ు, మరణం ప్రమాదం 72% తక్కువని వెల్లడైంది. ఈ అధ్యయనం వివరాలు న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి. గతేడాది డిసెంబరు 20 నుంచి ఈ ఏడాది ఫ్రిబవరి 1 మధ్య చేపట్టిన ఈ సర్వేలో భాగంగా 12 లక్షల మందిని అధ్యయనం చేశారు.
సీరంతో జట్టు.. భారీగా తయారీకి వీలు
భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)తో జట్టుకట్టడం పెద్దఎత్తున టీకా ఉత్పత్తికి వీలు కల్పిస్తుందని ఆస్ట్రాజెనకా, నొవావ్యాక్స్ తెలిపాయి. ఇందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాయి. ఆస్ట్రాజెనకా-ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన టీకాను సీరం సంస్థ భారత్‌లో కొవిషీల్డ్ పేరిట పంపిణీ చేస్తోంది. డబ్ల్యూహెవో చేపట్టిన ‘కోవ్యాక్స్’ కార్యక్రమంలో భాగంగా పేద, మధ్యస్థ ఆదాయ దేశాలకు టీకా అందించేందుకు ఇటీవలే సీరం సం స్థకు అత్యవసర వినియోగ అనుమతి వచ్చింది. ఈ ఏడాదిలో ఆస్ట్రాజెనకా, సీరంలు 30 కోట్ల డోసులను 145 దేశాలకు సరఫరా చేయనున్నాయి.