పెగాసస్.. భారత్ అంతర్గత విషయం: ఇజ్రాయెల్
ABN , First Publish Date - 2021-10-29T08:30:14+05:30 IST
పెగాసస్ స్పైవేర్ అంశం భారతదేశ అంతర్గత విషయమని.. అందులో తాను జోక్యం చేసుకోబోనని ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలన్ అన్నారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 28: పెగాసస్ స్పైవేర్ అంశం భారతదేశ అంతర్గత విషయమని.. అందులో తాను జోక్యం చేసుకోబోనని ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలన్ అన్నారు. పెగాస్‌సపై సుప్రీం తీర్పు నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ స్పైవేర్‌ను అనధికారికంగా వాడి మన దేశంలో పలువురిపై నిఘా వేశారన్న ఆరోపణలపై మీడియా ప్రశ్నించగా.. ఎన్‌ఎ్‌సవో లాంటి కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రభుత్వేతర సంస్థలకు విక్రయించడాన్ని ఇజ్రాయెల్ అనుమతించదని తెలిపారు. ఎన్‌ఎ్‌సవో గ్రూపు ఒక ప్రైవేటు సంస్థ అని.. అయితే, అది ఎగుమతి చేసే ప్రతి ఉత్పత్తికీ తమ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. పెగాసస్ నిఘాపై విచారణకు స్వతంత్ర నిపుణులను ఖరారుచేయడం చాలా కష్టతరమైందని.. చాలా మంది సున్నితంగా తిరస్కరించారు. ఇంకొందరు వ్యక్తిగత కారణాలు చూపారని సుప్రీంకోర్టు పేర్కొనడం తనను ఆందోళనకు గురిచేసిందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు.