సహాయక చర్యల్లో పాల్గొనండి
ABN , First Publish Date - 2021-07-24T08:03:24+05:30 IST
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయ చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులకు అగ్ర నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ పిలుపు
న్యూఢిల్లీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయ చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులకు అగ్ర నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘వరదలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ ప్రజలకు అండగా ఉంటాం. భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’’ అని పేర్కొన్నారు.