రామ్మోహన్ నాయుడికి సంసద్ రత్న అవార్డు
ABN , First Publish Date - 2021-03-21T07:59:26+05:30 IST
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు ప్రతిష్టాత్మక సంసద్ రత్న అవార్డు లభించింది. చెన్నైకి చెందిన ప్రైమ్ పా యింట్ ఫౌండేషన్ ప్రకటించిన ఈ అవార్డును శనివా రం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా

న్యూఢిల్లీ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు ప్రతిష్టాత్మక సంసద్ రత్న అవార్డు లభించింది. చెన్నైకి చెందిన ప్రైమ్ పా యింట్ ఫౌండేషన్ ప్రకటించిన ఈ అవార్డును శనివా రం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ చేతుల మీదుగా రామ్మోహన్ అందుకున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల్లో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు ఆ సంస్థ ఈ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు.