జోర్డాన్‌ పార్లమెంటులో కొట్టుకున్న ఎంపీలు

ABN , First Publish Date - 2021-12-30T07:27:33+05:30 IST

జోర్డాన్‌లో పార్లమెంటు సభ్యులు కొట్లాటకు దిగారు. రాజ్యాంగానికి ప్రతిపాదిత సవరణలపై ఆ దేశ పార్లమెంటులో చర్చ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది....

జోర్డాన్‌ పార్లమెంటులో కొట్టుకున్న ఎంపీలు

 మీడియాలో ప్రత్యక్ష ప్రసారమైన సంఘటన


అమ్మాన్‌, డిసెంబరు 29: జోర్డాన్‌లో పార్లమెంటు సభ్యులు కొట్లాటకు దిగారు. రాజ్యాంగానికి ప్రతిపాదిత సవరణలపై ఆ దేశ పార్లమెంటులో చర్చ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. చర్చలో పాల్గొన్న ఓ ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో... క్షమాపణలు చెప్పాల్సిందిగా సదరు ఎంపీని స్పీకర్‌ కోరారు. దీనికి ఎంపీ తిరస్కరించడంతో సభ నుంచి వెళ్లిపోవాల్సిందిగా స్పీకర్‌ కోరారు. ఈ సందర్భంగా  వాదనలకు దిగిన ఎంపీలు చివరకు కొట్టుకున్నారు. ఈ క్రమంలో కొందరు సభ్యులు కిందపడ్డారు. ఇదంతా ప్రభుత్వ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం అయింది. ఈ సంఘటనలో సభ్యులెవరూ గాయపడలేదని ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

Updated Date - 2021-12-30T07:27:33+05:30 IST