నాన్నా.. తొందరగా వచ్చెయ్: చనిపోయే ముందు రైతు ఆవేదన

ABN , First Publish Date - 2021-10-05T23:25:11+05:30 IST

లవ్‌ప్రీత్ సింగ్ (19), లఖింపూర్ కారు ప్రమాదంలో మరణించిన రైతుల్లో యువ రైతు ఇతడు. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోగా, ఇందులో నలుగురు రైతులు. అయితే ఈ ప్రమాదంలో లవ్‌ప్రీత్ సింగ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో..

నాన్నా.. తొందరగా వచ్చెయ్: చనిపోయే ముందు రైతు ఆవేదన

లఖ్‌నవూ: లఖింపూర్‌లో ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఒక యువ రైతులు మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన తండ్రికి తన క్షేమ సమాచారం చెబుతూనే తొందరగా తన దగ్గరికి వచ్చెయ్ అంటూ ఆవేదన చెందుతున్న ఆ మాటల్ని తలుచుకుంటూ కొందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.


లవ్‌ప్రీత్ సింగ్ (19), లఖింపూర్ కారు ప్రమాదంలో మరణించిన రైతుల్లో యువ రైతు ఇతడు. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోగా, ఇందులో నలుగురు రైతులు. అయితే ఈ ప్రమాదంలో లవ్‌ప్రీత్ సింగ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తన తండ్రికి ఫోన్ చేశాడట. తాను బాగానే ఉన్నానని, తొందరగా వచ్చెయ్యమని చెప్పినట్లు, కానీ తాను ఆసుపత్రికి వెళ్లే సరికే లవ్‌ప్రీత్ శవమై కనిపించినట్లు అతడి తండ్రి సత్నామ్ సింగ్ తెలిపాడు.


‘‘అతడిని (లవ్‌ప్రీత్ సింగ్) ఆసుపత్రికి తీసుకెళ్లాక నాకు ఫోన్ చేశాడు. ఎలా ఉన్నావ్ బేటా అని నేను అడిగాను. ‘పప్పా.. నేను బాగానే ఉన్నాను. తొందరగా ఆసుపత్రికి రా’ అంటూ చెప్పాడు. వస్తున్నాను, దారిలో ఉన్నానని చెప్పాను. కానీ లఖింపూర్ ఖేరికి వెళ్లే సమయానికే చనిపోయాడని తెలిసింది’’ అని సత్నామ్ సింగ్ బోరున విలపించాడు.

Updated Date - 2021-10-05T23:25:11+05:30 IST