పాలమూరు-రంగారెడ్డి కేసు విచారణ వాయిదా

ABN , First Publish Date - 2021-08-27T08:16:25+05:30 IST

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.

పాలమూరు-రంగారెడ్డి కేసు విచారణ వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ గురువారం సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ హాజరయ్యారు. ‘‘ఈ కేసును మీరు విచారించాలనుకుంటున్నారా.’’ అని ఆయన అడిగారు. దానికి స్పందించిన జస్టిస్‌ రమణ.. ‘‘అది కూడా ఒక అంశం. పరిశీలిస్తాం’’ అంటూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. 

Updated Date - 2021-08-27T08:16:25+05:30 IST