పఠాన్‌కోట్‌లో పాక్ డ్రోన్... కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్!

ABN , First Publish Date - 2021-03-14T17:12:18+05:30 IST

పంజాబ్‌కు చెందిన పఠాన్‌కోట్‌లోని...

పఠాన్‌కోట్‌లో పాక్ డ్రోన్... కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్!

పఠాన్‌కోట్: పంజాబ్‌కు చెందిన పఠాన్‌కోట్‌లోని భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ కనిపించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ డ్రోన్ పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో పహారా కాస్తున్న బీఎఫ్ఎప్ జవానులు దీనిని గమనించారు. వెంటనే దానిపై కాల్పులు ప్రారంభించారు. అయితే ఇంతలోనే ఆ డ్రోన్ పాకిస్తాన్ వైపు వెళ్లిపోయింది. 


దీంతో బీఎస్‌ఎఫ్ జవానులు ఆ ప్రాంతంలో అణువణువుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. బీఎస్ఎఫ్‌తోపాటు స్వెట్ కమెండోలు డోన్ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి బీఎస్ఎఫ్ అధికారి తరసెమ్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో అనుమానాస్పద వస్తువేదైనా కనిపిస్తే తమకు తెలియజేయాలని ఆయన స్థానికులను కోరారు. 

Updated Date - 2021-03-14T17:12:18+05:30 IST