కాబూల్‌కు విమానాలు రద్దు చేసిన పాకిస్థాన్

ABN , First Publish Date - 2021-10-15T00:28:23+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌కు విమానాలు రద్దు చేస్తూ పాకిస్థాన్ నేడు (గురువారం) నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్

కాబూల్‌కు విమానాలు రద్దు చేసిన పాకిస్థాన్

ఇస్లామాబాద్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌కు విమానాలు రద్దు చేస్తూ పాకిస్థాన్ నేడు (గురువారం) నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగానే పాక్ తమ విమానాలను రద్దు చేసినట్టు తెలుస్తోంది. నేటి నుంచే కాబూల్‌కు విమానాలు రద్దు చేస్తున్నట్టు పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. టికెట్ ధరలను తగ్గించాలని, ఆగస్టు 15 నాటి ముందునాటి ధరలను అమలు చేయాలని తాలిబన్ ప్రభుత్వం ఆదేశించింది. లేదంటే విమాన సర్వీసులను నిలిపివేస్తామని ఆఫ్ఘనిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (ఏసీఏఏ) హెచ్చరించింది.

 

ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌కు పాకిస్థాన్ నుంచి మాత్రమే విమాన సర్వీసులు ఉన్నాయి. ఇస్లామాబాద్-కాబూల్ మధ్య తాలిబన్లు హస్తగతం చేసుకోవడానికి ముందు 120-150 డాలర్ల మధ్య టికెట్ ధరలు ఉండేవి. ప్రస్తుతం 2,500 డాలర్లకు విక్రయిస్తున్నారు. టికెట్ ధరలను మరీ అంతగా తగ్గించడం సాధ్యం కాకపోవడంతో విమానాలను నిలిపివేస్తున్న పీఐఏ పేర్కొంది.

Updated Date - 2021-10-15T00:28:23+05:30 IST