యూకే స్ట్రెయిన్‌పై ఆక్స్‌ఫర్డ్‌ టీకా పనిచేస్తుంది

ABN , First Publish Date - 2021-02-08T08:04:21+05:30 IST

యూకేలో గుర్తించిన కరోనా కొత్త స్ట్రెయిన్‌పైనా ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగ పరీక్షల చీఫ్‌ ఇన్వెస్టిగేటర్‌ ఆండ్రూ పోలార్డ్‌ వెల్లడించారు...

యూకే స్ట్రెయిన్‌పై ఆక్స్‌ఫర్డ్‌ టీకా పనిచేస్తుంది

  • తాజా అధ్యయనంలో గుర్తింపు 


లండన్‌, ఫిబ్రవరి 7: యూకేలో గుర్తించిన కరోనా కొత్త స్ట్రెయిన్‌పైనా ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగ పరీక్షల చీఫ్‌ ఇన్వెస్టిగేటర్‌ ఆండ్రూ పోలార్డ్‌ వెల్లడించారు. కొవిడ్‌ ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి మూల కారణమైన వైరస్‌ రకంతో పాటు ‘బి.1.1.7 కెంట్‌’ అనే స్ట్రెయిన్‌పైనా టీకా సమర్ధంగా పనిచేస్తోందని తాజా అధ్యయనంలో గుర్తించినట్లు ఆయన తెలిపారు. అయితే దక్షిణాఫ్రికాలో గుర్తించిన కరోనా స్ట్రెయిన్‌పై ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ పనిచేస్తుందా? పనిచేయదా? అనేది తేలాల్సి ఉందన్నారు. కాగా, దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్‌ వల్ల సోకే తేలికపాటి, మోస్తరు కరోనా ఇన్ఫెక్షన్లను నిలువరించడంలో ఈ వ్యాక్సిన్‌ తక్కువ ప్రభావశీలతను చూపుతోందని ఈ పరిశోధనల్లో కీలక పాత్ర పోషించిన ముఖ్య శాస్త్రవేత్త సారా గిల్బర్ట్‌ చెప్పారు.  


Updated Date - 2021-02-08T08:04:21+05:30 IST