దాదాపు 40 దేశాలు భారత్‌కు సహాయం అందించాయి : విదేశాంగ శాఖ

ABN , First Publish Date - 2021-05-21T03:04:06+05:30 IST

దాదాపు 40 దేశాలు కోవిడ్ సంబంధిత పరికరాలు మరియు సామాగ్రిని భారత్‌కు పంపించాయని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది.

దాదాపు 40 దేశాలు భారత్‌కు సహాయం అందించాయి : విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ : దాదాపు 40 దేశాలు కోవిడ్ సంబంధిత పరికరాలు మరియు సామాగ్రిని భారత్‌కు పంపించాయని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈ ఎగుమతులు జరిగాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. కోవిడ్‌పై పోరాడుతున్న క్రమంలో చాలా దేశాలు భారత్‌కు సంఘీభావం తెలపడానికి, మద్దతివ్వడానికి ముందుకు వచ్చాయని పేర్కొన్నారు. ఇందులో 40 దేశాలు భారత్‌కు కోవిడ్‌పై పోరాడడానికి అవసరమైన సామాగ్రిని, పరికరాలను పంపాయని అరిందమ్ బాగ్చి వెల్లడించారు. 

Updated Date - 2021-05-21T03:04:06+05:30 IST