మాయదారి మహమ్మారి.. రోజుకు 20 మంది వైద్యులను పొట్టన పెట్టుకుంటున్న కరోనా

ABN , First Publish Date - 2021-05-21T22:53:20+05:30 IST

కరోనా సెకండ్ వేవ్ వైద్యులను కూడా పెద్ద ఎత్తున బలితీసుకుంటోంది. రెండో దశలో ఇది ఏకంగా 329 మంది వైద్యుల ప్రాణాలను

మాయదారి మహమ్మారి.. రోజుకు 20 మంది వైద్యులను పొట్టన పెట్టుకుంటున్న కరోనా

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ వైద్యులను కూడా పెద్ద ఎత్తున బలితీసుకుంటోంది. రెండో దశలో ఇది ఏకంగా 329 మంది వైద్యుల ప్రాణాలను హరించినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. వీరిలో దాదాపు 80 మంది ఒక్క బీహార్‌కు చెందినవారేనని పేర్కొంది. ఢిల్లీలో 73 మంది మరణించారని తెలిపింది. కరోనా బారినపడి ఉత్తరప్రదేశ్‌లో 41 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్టు ఐఎంఏ వివరించింది. 


ప్రమాదకరమైన ఈ మహమ్మారి బారినపడి రోజుకు సగటున 20 మంది వైద్యులు కన్నుమూస్తున్నారని ఐఎంఏ ఆవేదన వ్యక్తం చేసింది. నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. మృతి చెందిన వారిలో ప్రభుత్వ, ప్రైవేటు, మెడికల్ ఆసుపత్రులలోని వైద్యులు ఉన్నట్టు ఐఎంఏ వివరించింది. గత రెండు నెలల్లో 270 మంది వైద్యులు రెండో వేవ్ కారణంగా మరణించారని మంగళవారం ఐఎంఏ తెలిపింది.  ఇప్పుడీ సంఖ్య 300 దాటింది. ఇక తొలి వేవ్‌లో గతేడాది 748 మంది వైద్యులు కరోనాతో మరణించారని పేర్కొంది.  

Updated Date - 2021-05-21T22:53:20+05:30 IST