పినరయ్ ప్రమాణ స్వీకారానికి వెళ్లం : యూడీఎఫ్

ABN , First Publish Date - 2021-05-19T00:00:00+05:30 IST

పినరయ్ విజయన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తాము హాజరు కావడం లేదని ప్రతిపక్ష యూడీఎఫ్ ప్రకటించింది.

పినరయ్ ప్రమాణ స్వీకారానికి వెళ్లం : యూడీఎఫ్

తిరువనంతపురం :  పినరయ్ విజయన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తాము హాజరు కావడం లేదని ప్రతిపక్ష యూడీఎఫ్ ప్రకటించింది. ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని 500 మందితో నిర్వహిస్తామన్న సీపీఎం నిర్ణయాన్ని యూడీఎఫ్ తప్పుపట్టింది. తాము ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కామని, వర్చువల్ ద్వారా వీక్షిస్తామని యూడీఎఫ్ కన్వీనర్ హుస్సేన్ తెలిపారు. ‘‘తాము ఈ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేయడం లేదు.  మరోవైపు పినరయ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుంది. దీనికి 500 మంది హాజరవుతున్నారు. ఆహ్వానితుల కోటా కింద 500 పాసులు జారీ చేశారు. 

Updated Date - 2021-05-19T00:00:00+05:30 IST