సాగు చట్టాలపై రాజ్యసభలో విపక్ష ఎంపీల రగడ

ABN , First Publish Date - 2021-08-11T00:08:16+05:30 IST

సాగు చట్టాలపై రాజ్యసభలో విపక్ష ఎంపీల రగడ

సాగు చట్టాలపై రాజ్యసభలో విపక్ష ఎంపీల రగడ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ రాజ్యసభలో విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ‘జై జవాన్.. జై కిసాన్’ అంటూ ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్లమెంట్ ప్రారంభమైనప్పటి నుంచే విపక్ష ఎంపీలు నిరసన ప్రారంభించారు. సభ నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచే సాగు చట్టాలపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్ష నేతలు నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ నిరసన చేపడుతూనే ఉన్నారు. అయితే మోదీ ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకోకుండా తమ బిల్లుల్ని పాస్ చేసుకుంటూ పోతోంది. మరోవైపు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో నవంబర్‌లో రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది.



Updated Date - 2021-08-11T00:08:16+05:30 IST