బడ్జెట్ ప్రసంగంపై ఎంపీల నినాదాలు...నల్లని గౌన్లు ధరించి సభ్యుల నిరసన

ABN , First Publish Date - 2021-02-01T17:36:26+05:30 IST

పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2021 బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు రైతుల నిరసనను ప్రస్థావిస్తూ నినాదాలు చేశారు....

బడ్జెట్ ప్రసంగంపై ఎంపీల నినాదాలు...నల్లని గౌన్లు ధరించి సభ్యుల నిరసన

న్యూఢిల్లీ : పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2021 బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు రైతుల నిరసనను ప్రస్థావిస్తూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష ఎంపీల నిరసన నినాదాలతో నిర్మలాసీతారామన్ చేస్తున్న ప్రసంగం సరిగా వినిపించలేదు. కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు జస్పీర్ సింగ్ గిల్, గుర్జిత్ సింగ్ అజ్లాలు నల్లని గౌన్లు ధరించి వచ్చి పార్లమెంటులో నిరసన తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు నెలలుగా లక్షలాదిమంది రైతులు ఆందోళన చేస్తున్న విషయాన్ని ప్రతిపక్ష సభ్యులు ప్రస్థావించారు. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా బడ్జెట్ తయారు చేశామని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. 

Updated Date - 2021-02-01T17:36:26+05:30 IST