శశికళ తిరిగి వస్తానంటే తప్పకుండా ఆలోచిస్తాం : పన్నీర్ సెల్వం

ABN , First Publish Date - 2021-03-24T21:45:54+05:30 IST

శశికళ తిరిగి అన్నాడీఎంకేలో వస్తానన్న ప్రతిపాదనలు వస్తే మాత్రం తప్పకుండా ఆలోచిస్తామని డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పేర్కొన్నారు

శశికళ తిరిగి వస్తానంటే తప్పకుండా ఆలోచిస్తాం : పన్నీర్ సెల్వం

చెన్నై : శశికళ తిరిగి అన్నాడీఎంకేలో వస్తానన్న ప్రతిపాదనలు వస్తే మాత్రం తప్పకుండా ఆలోచిస్తామని డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. అన్నాడీఎంకే వ్యక్తులపైన గానీ, కుటుంబాలపైన గానీ ఆధారపడదని స్పష్టం చేశారు. శశికళపై తనకు ఎలాంటి కోపమూ లేదని, నిరాశ కూడా లేదని పేర్కొన్నారు. శశికళ అన్నా, టీవీవీ దినకరన్ అన్నా తానెంతో గౌరవిస్తానని ఆయన అన్నారు. ఆమె తిరిగి రాజకీయాల్లోకి రావాలనుకుంటే తన ఇష్టమని, ఆ నిర్ణయం ఆమె మాత్రమే తీసుకోవాలని అన్నారు. తనకు, సీఎం పళని స్వామికి మధ్య ఎలాంటి విభేదాలూ లేవని, పళని స్వామే సీఎం అభ్యర్థిగా ఉండాలని ప్రతిపాదించిన వారిలో తానూ ఒకరినని వెల్లడించారు. ‘‘రాజకీయాల్లో రాజీలు పడటం సహజం. అందుకు సిద్ధంగా ఉండాలి కూడా. తానే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు. ఆ విషయంపై చర్చిచాం. సీఎం అభ్యర్థిగా ఆయన పేరును నేనే సూచించా.’’ అని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. 


Updated Date - 2021-03-24T21:45:54+05:30 IST