రెండో ఏడాదీ ఊటీ వేసవి ఉత్సవాల రద్దు

ABN , First Publish Date - 2021-05-18T12:53:17+05:30 IST

నీలగిరి జిల్లా చరిత్రలో వేసవి ఉత్సవాలు వరుసగా రెండో ఏడాది కూడా రద్దయ్యాయి.

రెండో ఏడాదీ ఊటీ వేసవి ఉత్సవాల రద్దు

చెన్నై/పెరంబూర్ : నీలగిరి జిల్లా చరిత్రలో వేసవి ఉత్సవాలు వరుసగా రెండో ఏడాది కూడా రద్దయ్యాయి. గత ఏడాది మార్చిలో కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఊటీలోని బొటానికల్‌ గార్డెన్‌ సహా అన్ని పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. అనంతరం కరోనా నియంత్రణ లోకి రావడంతో గత ఏడాది సెప్టెంబరు నుంచి సందర్శకులను అనుమతిస్తు న్నారు. ప్రతి ఏటా వేసవి సీజన్‌లో నిర్వహించే ఉత్సవాలకు దేశ, విదేశాలకు చెందిన లక్షలాది మంది పర్యాటకులు వచ్చి ప్రకృతి అందాలు వీక్షిస్తుం టారు. గత ఏడాది కరోనా కారణంగా ఈ ఉత్సవాలు రద్దుకాగా, ఈ ఏడాది నిర్వహించేందుకు సిద్ధమైన జిల్లా యంత్రాంగం గత డిసెంబరు నుంచే బొటానికల్‌ పార్క్‌ సహా పలు పర్యాటక ప్రాంతాల్లో అరుదైన మొక్కలు నాటి, సంరక్షించగా, ప్రస్తుతం మొక్కలకు పూచిన వివిధ రంగులతో పుష్పాలతో సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో, కరోనా రెండవ దశ వ్యాప్తిని నియంత్రించేలా ప్రభుత్వం విధించిన సంపూర్ణ లాక్‌ డౌన్‌ కారణంగా వరుసగా రెండవ ఏడాది వేసవి ఉత్సవాలు రద్దయ్యాయి.

Updated Date - 2021-05-18T12:53:17+05:30 IST