ఎగుమతి అవకాశాలపై ఆన్లైన్ శిక్షణ
ABN , First Publish Date - 2021-02-27T12:09:28+05:30 IST
ఎగుమతి అవకాశాలు, వ్యాపారం ప్రారంభించడం వంటి వాటిపై మూడు రోజుల ఆన్లైన్ శిక్షణా తరగతులను రాష్ట్ర వృత్తుల అభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ...
చెన్నై/ఐసిఎఫ్ (ఆంధ్రజ్యోతి): ఎగుమతి అవకాశాలు, వ్యాపారం ప్రారంభించడం వంటి వాటిపై మూడు రోజుల ఆన్లైన్ శిక్షణా తరగతులను రాష్ట్ర వృత్తుల అభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ ఎస్.నాగరాజన్ విడుదల చేసిన ప్రకటనలో, శనివారం నుంచి మార్చి 1వ తేది వరకు జరిగే శిక్షణా తరగతుల్లో ఎగుమతి అవకాశాలు, వ్యాపారం ప్రారంభం వంటి శిక్షణ ఇవ్వనున్నామన్నారు. 18 ఏళ్లు పైబడి టెన్త్ ఉత్తీర్ణులైన పురుషులు, మహిళలు శిక్షణలో పాల్గొనవచ్చు. వివరాలకు 9444556099, 9444557654 నెంబర్లలో సంప్రదించవచ్చు.