కమల్ హాసన్ పార్టీకి మరొకరు రాజీనామా
ABN , First Publish Date - 2021-05-20T21:35:38+05:30 IST
కమల్ హాసన్ పార్టీకి మరొకరు రాజీనామా

చెన్నై: కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పార్టీ ఉపాధ్యక్షుడు సహా కొందరు ప్రముఖులు రాజీనామా చేయగా తాజాగా మరో కీలక నేత గురువారం రాజీనామా చేశారు. సీకే కుమారవేల్, కమల్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కీలకంగా వ్యవహరించారు. కాగా, ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తూ పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. అయితే ఎన్నికలకు సంబంధించి పార్టీకి సీకే కుమారవేల్ సరైన సూచనలు ఇవ్వలేదనే విమర్శ ఉంది.
మే 2న అసెంబ్లీ ఫలితాలు వెలువడిన నాటి నుంచి పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా సీకే కుమారవేల్ రాజీనామాతో కలిపి ఇప్పటి వరకు ఆరుగురు పార్టీని వీడారు. 234 అసెంబ్లీ స్థానాల్లో మక్కల్ నీది మయ్యం పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకోకపోవడం పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని తీవ్రంగా నిరాశపరిచింది.