గుర్తించిన కొవిడ్‌ వైద్య కేంద్రాల్లోనే ఒమైక్రాన్‌ చికిత్స

ABN , First Publish Date - 2021-12-09T07:20:09+05:30 IST

ఒమైక్రాన్‌ కరోనా వేరియంట్‌ సోకే వారికి ‘గుర్తించిన కొవిడ్‌ వైద్య కేంద్రాల్లో’నే చికిత్స చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం నిర్దేశించింది.

గుర్తించిన కొవిడ్‌ వైద్య కేంద్రాల్లోనే ఒమైక్రాన్‌ చికిత్స

రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు 

మైక్రాన్‌ కరోనా వేరియంట్‌ సోకే వారికి ‘గుర్తించిన కొవిడ్‌ వైద్య కేంద్రాల్లో’నే చికిత్స చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం నిర్దేశించింది. ఆ ఆస్పత్రుల్లో రోగుల కోసం ప్రత్యేకమైన ఐసొలేషన్‌ ఏరియా కూడా ఉండాలని సూచించింది. ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్గదర్శకాలతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు, వారి సన్నిహితులకు ఒమైక్రాన్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయితే ఎప్పటికప్పుడు శాంపిళ్లను ఇన్సాకాగ్‌ ల్యాబ్‌లకు పంపాలని ఆయన కోరారు. పాజిటివ్‌ నిర్ధారణ అయ్యే వారికి సంబంధించిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను త్వరితగతిన గుర్తించాలని పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-09T07:20:09+05:30 IST