chennai: అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన

ABN , First Publish Date - 2021-10-19T14:38:31+05:30 IST

సకాలంలో విధులకు హాజరుకాని అధికారుల తీరును నిరసిస్తూ ప్రజలు ఆందోళన చేపట్టారు. తిరువళ్లూర్‌ జిల్లా మీంజూరు పట్టణంలో పనిచేస్తున్న ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన

chennai: అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన

గుమ్మిడిపూండి(chennai): సకాలంలో విధులకు హాజరుకాని అధికారుల తీరును నిరసిస్తూ ప్రజలు ఆందోళన చేపట్టారు. తిరువళ్లూర్‌ జిల్లా మీంజూరు పట్టణంలో పనిచేస్తున్న ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి వినతిపత్రాలు సమర్పిస్తుంటారు. కానీ, కార్యాలయ అధికారులు, ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరుకాకుండా మధ్యాహ్నం 12 గంటల తరువాత వస్తున్నట్టు, దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో, సోమవారం గ్రీవెన్స్‌డే సందర్భంగా పలువురు ప్రజలు తమ సమస్యలు తెలిపేందుకు కార్యాలయానికి వచ్చారు. కానీ, సమయం గడుస్తున్నా అధికారులు రాకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు కార్యాలయంలో భైఠాయించి ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న మీంజూరు పోలీసులు అక్కడకు చేరుకొని ప్రజలతో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు.

Updated Date - 2021-10-19T14:38:31+05:30 IST