ఆక్సిజన్, కొవిడ్ మందుల బ్లాక్ మార్కెటింగ్‌పై ఒడిశా మానవహక్కుల కమిషన్ ఆగ్రహం
ABN , First Publish Date - 2021-05-20T13:33:28+05:30 IST
ఆక్సిజన్, కొవిడ్ మందుల బ్లాక్ మార్కెటింగ్‌పై ఒడిశా మానవహక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది...

ప్రభుత్వానికి నోటీసులు జారీ
భువనేశ్వర్ (ఒడిశా): ఆక్సిజన్, కొవిడ్ మందుల బ్లాక్ మార్కెటింగ్‌పై ఒడిశా మానవహక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రాణాధార ఔషధాలు, ఆక్సిజన్ బ్లాక్ మార్కెటింగ్ లపై పత్రికల్లో వచ్చిన వార్తలను ఒడిశా మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఒడిశా చీఫ్ సెక్రటరీ, వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఆక్సిజన్, కొవిడ్ మందుల బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయించడంపై సమగ్ర నివేదిక అందించాలని ఒడిశా మానవహక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఆక్సిజన్, కొవిడ్ మందుల బ్లాక్ మార్కెటింగ్‌పై పోలీసు డైరెక్టర్ జనరల్ చర్యలు తీసుకోవాలని ఒడిశా మానవహక్కుల కమిషన్ ఆదేశించింది. అంబులెన్సు సేవలకు చార్జీలు నిర్ణయించాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గ్రామీణ ప్రాంతాల్లో తాత్కాలిక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కరోనా మృతదేహాల అంత్యక్రియల కోసం నిబంధనలు అమలు చేయాలని ఒడిశా మానవ హక్కుల కమిషన్ సూచించింది.